పల్లవి:నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు (1)యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా? (2)
1. మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా (2) మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం (2)
2. మారు మనస్సు పొందెద మిపుడే - జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం
3. అపవాదికి చోటివ్వక - బహు జాగ్రతతో నుండెదము మనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము
4. నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదము నీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో
5. పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమా ఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును
6. ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవుని నీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు
7. ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములని పూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు