పల్లవి:మాయ లోకము - మోసపోకుము - యేసునందే రక్షణ దొరుకును నీకు (2)
1. బంధుమిత్రులు - భార్య బిడ్డలు (2) -ధనము ఘనము అందచందము (2) అవి అన్నియును - నీటిబుడగలె (2) - సమాధితోనే - సమాప్తమౌను (2)
2. పడగ విప్పిన పామువలె నీ - పాపము నిన్ను వెంబడించును పాప ఫలితము మరణమేగదా - దాని అంతము నిత్యనరకము
3. నిన్ను రక్షింపనెంచి ప్రభువు - పరమును విడచి ధరకు వచ్చెను నీకు బదులుగా శ్రమల నోర్చెను -సిలువలోనే బలియాయె నేసు
4. ఇప్పుడైనను ఒప్పుకొనుమిక - నీ పాపజీవితము నంతయు నిన్ను క్షమించును కృపతో ప్రభువు - ఇదియే నీ రక్షణ దినముగా
5. దేహమంత ప్రభు గాయముల్ పొందె - పరిశుద్ధ రక్తమును కార్చెను నిత్యజీవము నీకు నీయను - మృతిని గెల్చి తిరిగి లేచెను