CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 36

మన బలమైన యాకోబు దేవునికి

mana balamaina yaakobu devuniki

Psalms 81:1-14

More
Reference recording on YouTube ↗
పల్లవి:మన బలమైన యాకోబు దేవునికి (2) - గానము సంతోషముగా పాడుడీ (2)
అను పల్లవి:పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి - సితార స్వరమండలము వాయించుడి (2)
1. అమావాస్య పున్నమ పండుగ దినములందు (2) కొమ్మునూదుడి యుత్సాహముతోడ (2) యాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ (2)
2. తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగ నిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెరుగని భాషను నే వింటిని
3. తమభుజము నుండి బరువు దింపగ - మోతగంపల భారము దప్పెను నీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే
4. ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని మెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి
5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడను నీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో
6. అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్ను కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా
7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగు అన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు

Back to Hebron Seeyonu Geethalu