CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 35

దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి

devuniki morrapettudunu elugetti

Psalms 77:1-14

More
Reference recording on YouTube ↗
1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి (2) చెవి యొగ్గు వరకు మనవి చేయుచుందును (2)
2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును
3. దేవుని దలచి నిట్టూర్పు విడుచుచున్నాను ధ్యానించు నపుడు ఆత్మ కృంగిపోవుచున్నది
4. మూత పడనియ్యవు నీవు నాదు కన్నులు మాటాడజాలనైతి నేను కలవరపడి
5. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును
6. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది
7. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా
8. తన కటాక్ష మెన్నటికిని మానిపోయెనా తరములకు తన మాట తప్పి పోయెనా
9. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా దేవుడు కోపముతో కృప చూపకుండునా?
10. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను అనుకొనుటకు నా శ్రమలే కారణము
11. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు
12. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును నీ క్రియలను ధ్యానము నే జేసికొందును
13. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?
14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో ప్రభావమును చూపియున్నావు

Back to Hebron Seeyonu Geethalu