పల్లవి:పాపులకొరకు ప్రభుయేసు (2)- సిలువలో బలియాయెను (1)పాపికి రక్షణనిచ్చెను (1)-పావన రక్తము కార్చి (2)
1. దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా? మునిగెదవేల ఎన్నడు పాపములో? (2) దాచిన నీవు నీ పాపమును ప్రియుడా - నిత్య జీవమును ఏలాగు పొందెదవు? (2)
2. పాపభారము క్రింద పడియున్న ప్రియుడా ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా - యిదియే యేసుని వాగ్దానము నమ్ము
3. నరక మార్గము విశాలము ప్రియుడా జీవమునకు పోవుమార్గము ఇరుకు ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా - పరము చేరుదువు యేసుని ద్వారానే
4. ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా పాప దుఃఖముతో నిండియున్నది దీనుడవై నీవు శుద్ధిని కోరుము ప్రియుడా - దొరుకును రక్షణ యీ క్షణమే