1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ (2)-సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ (2)
2. అతనినిబట్టి మానవులెల్లరు - తథ్యముగానే దీవించబడెదరు
3. అన్యజనులందరును అతని - ధన్యుడని చెప్పుకొను చుందురు
4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా - దేవుడు స్తుతింపబడును గాక
5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు - చేయువాడు గాన స్తోత్రార్హుండు
6. ఆయన మహిమగల నామము - నిత్యమును స్తుతింపబడును గాక
7. సర్వభూమి ఆయన మహిమచే - నిండియుండును గాక ఆమెన్ ఆమెన్