1. నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు (2) నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక (2)
2. దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై
3. స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
4. యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు ఏలెదవు భూమిమీద - నున్న జనులను
5. జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక జనులు దేవా నిన్ను - స్తుతియించెదరు గాక
6. భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును భూలోకులందరు దైవ - భక్తి కల్గియుందురు