1. దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు పాప పరిహారార్థ ఊట తెరచెన్ (1) పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా! ఇపుడు విడుదలను కోరి పొందెదవా! (1)
పల్లవి:రక్తమందు రక్తమందు - పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా? (1)రక్తమందు రక్తమందు - ఇపుడు విడుదలను కోరి పొందెదవా? (1)
2. అపవిత్రుడైనను అక్రమస్తుడైనను ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును ఏలు పాపమైనను - అతిక్రమమైనను ఏలికచే మన్నింపబడి యున్నావా? || రక్త ||
3. ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా? మాయవేషమంతయు - వీడియున్నావా? పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా? శాపలోకముపై జయ మొందుచున్నావా? || రక్త ||
4. ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా? అల్పవిషయములోను సత్యమున్నదా? నాడు మరణించిన యేసులేచియున్నాడు నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును || రక్త ||
5. పంచఖండములను రక్షించుట కొరకు పంచగాయ మొందిన ప్రభుని చూడుమా ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల మించు సత్యములను కోరి వెదకుము || రక్త ||
6. రేపు రేపు యనుట నమ్మిక కానేరదు మాపు మరణించిన నెచటి కేగుదువు? ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును || రక్త ||
7. హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు కల్ల కార్యములను విడచివేయుము చెల్లచెదరగును కష్టము లచ్చోటను కొల్లగా ననుభవింతువు సుఖంబును || రక్త ||