పల్లవి:పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై (2)
1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను (2) ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా (2)
2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్
3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్
4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే
5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్