పల్లవి:కొంతసమయమే మిగిలినది (2)- క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్ (2)లేశమైనను జాగుచేయడు (2)
1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము (2)- నిశ్చయముగా ఆయన వచ్చును (2) ప్రభురాక నెవరు ప్రేమింతురో - వారిని ప్రభువు కొనిపోవును (2)
2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి ప్రభు వాక్యమునకు లోబడియు -ఆయన కొరకై కనిపెట్టెదం
3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్
4. తమ స్వంత పనులలో విశ్వాసులు - కొందరు నిద్రించు చున్నారుగా మేల్కొను వారెత్తబడెదరు - విడువ బడిన వారిగతి యేమగున్
5. నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు