పల్లవి:లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు (1)లేచినాడురా సమాధి గెలిచినాడురా (1)
అను పల్లవి:లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు (2) || లేచి ||
1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు (2) ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న (2)
2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు
3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ లేడు గలిలయ ముందుగ పోతు - న్నాడు అపుడే లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు
6. నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గ మెరుగు నేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు
7. నేను లేచిన యేసు నందు - మానక మది నమ్ముకొందు తాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు
8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని
9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం
10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు