పల్లవి:గీతం గీతం జయ జయ గీతం - చేయి తట్టి పాడెదము (2)
అను పల్లవి:యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము (2)
1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను (2) అందు వేసిన ముద్ర, కావలి నిల్చెనా - దైవ సుతుని ముందు (2)
2. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి
3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి ఇంక దూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి
4. గుమ్మముల్ తెరిచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళ తాళ వాద్యముల్ బూర - లెత్తి ధ్వనించుడి