పల్లవి:దైవతనయా క్రీస్తునాథుండా - అయ్యా -పాపులకై ప్రాణమిచ్చితివా - దేవుడే నిను పంపినాడా (2)
1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా (2) ప్రాణదానము చేసినావా - దేవా - పరలోకము తెరచినావా (2)
2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము కడిగి పావన పరచినావా - దేవా - కడకు బూరతో రానై యున్నావా
3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా మహిమతోడ లేచినావా - దేవా - మాదు చింతలు దీర్చినావా
4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణికే ఏతెంచినావా - దేవా - ధన్యులనుగా జేసినావా
5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు అల్ఫయు ఓ మేగయు నీవేగా - యేసు - ఆర్భటించుచు రానై యున్నావా