CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 270

వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును

vintimayyaa nee svaramu kantimayyaa nee roopamunu

Matthew 17:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును (1)ప్రియప్రభూ నిన్నుగాక - వేరెవరిని చూడము వినము (1)
1. భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా, (2) దూతలకు కనబడితివి - లోకమందు నమ్మబడియున్న దేవా (2)
2. భయపడవలదని దూతలు తెల్పె -మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి
3. నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు, వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక
4. మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివి - పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా
5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివి - నమాధి నిన్ను గెలువక పోయెను
6. ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము - మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుమ్

Back to Hebron Seeyonu Geethalu