1. దూత పాట పాడుఁడి - రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను ఆకశంబునందున - మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
2. ఊర్థ్వలోకమందున - గొల్వఁ గాను శుద్ధులు అంత్యకాలమందున - కన్యగర్భమందున బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుఁ డా - నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
3. రావె నీతి సూర్యుఁడా - రావె దేవపుత్రుఁడా నీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెను భూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురు నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును దూత పాట పాడుఁడి - రక్షకున్ స్తుతించుడి