CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 260

భయము లేదుగా మనకు భయము లేదుగా

bhayamu ledugaa manaku bhayamu ledugaa

Job 5:19,20 ; Isaiah 27:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:భయము లేదుగా మనకు భయము లేదుగా (2)దయగల మన దేవుడుండ భయము లేదుగా (1)
1. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు (2) ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన (2) పరిశుద్ధుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక (2)
2. అపవాది తంత్రములపై విజయమిచ్చును అభయమిచ్చి క్షేమముగ ఆదరించును అక్షయుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు నిర్మలుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన ఏకీడు తగులకుండ కాయు శక్తితో శక్తిమంతుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక
5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతము మహిమరాజు మనకొరకై తిరిగి వచ్చును మన ప్రభువగు యేసుడే - నిత్యము కాపాడు గనుక

Back to Hebron Seeyonu Geethalu