CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 259

మేము భయపడము ఇక మేము భయపడము

memu bhayapadamu ika memu bhayapadamu

Isaiah 27:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:మేము భయపడము ఇక మేము భయపడము (1)ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు (2)
1. దైవభ్రష్టులమైన మమ్ము - దివ్యంపుగా రక్షించె (2) దివారాత్రులు దేవుడే కాయును (1)
2. శత్రుకోటి మమ్ము జుట్టన్ - పాతాళము మ్రింగ జూడన్ నిత్యుడు యేసు నిత్యము కాయును
3. అగ్ని పరీక్షల యందు - వాగ్దానమిచ్చె మాతోనుండ యే ఘడియైనను విడువక కాయును
4. బలమైన ప్రభు హస్తములు - వలయము వలె మమ్ము జుట్టి పలు విధములుగా కాపాడుమమ్ము
5. కునుకడు మనదేవుడు - యెన్నడు నిద్రించడు కనుపాపగ మము కాపాడునెప్పుడు
6. జీవిత కష్టనష్టములు - ఆవరించి దుఃఖపరచ దేవుడొసంగిన ఈవుల నెంచుచు
7. ఇహమందు మన శ్రమలన్ని - మహిమకు మార్చెడు ప్రభున్ మహిమపరచి మ్రొక్కెదమిలలో

Back to Hebron Seeyonu Geethalu