పల్లవి:దేవుడే మనకాశ్రయమును - దుర్గమునై యున్నాడు - ఆపదలో
అను పల్లవి:కావున భూమి - మార్పు నొందినను - కొండలు మున్గినను (2)- ఆపదలో
1. సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టినను (2) - ఆ పొంగుకు పర్వతములు - కదలినను - మనము భయపడము ఆ పొంగుకు పర్వతములు - కదలినను - మనము భయపడము - ఆపదలో (1)
2. ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమును - సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - ఆపదలో
3. దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదు - అరుణో దయమున దానికి సహాయము చేయుచున్నాడు - అరుణో దయమున దానికి సహాయము చేయుచున్నాడు - ఆపదలో
4. జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవి - ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆపదలో
5. సైన్యము లధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడు - యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - ఆపదలో
6. యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండి - అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - ఆపదలో
7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి - అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను - అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను - ఆపదలో