పల్లవి:కుమారి ఆలకించు - నీ వాలోచించి - కుమారి చెవియొగ్గుము (2)
అను పల్లవి:మరువుము నీదు స్వంత జనమును (2)మరువుము నీదు తండ్రి యింటిని (2) || కుమారి ||
1. ఈ రాజు నీ ప్రభువు (1)- నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు (2) ఈ రాజు నీదు సౌందర్యమును గోరె (2) ఈ రాజునకు నమస్కరించుము (2)
2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చును ప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు
3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలది శృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి
4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగల రాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది
5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతో రాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు
6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగా ఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు
7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవు కాన జనములు సర్వకాలము - కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు