పల్లవి:ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను - ఎంత జాలి యేసువా
1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను (2) అవిశ్వాసినైన నన్ను (2)- ఆదరించినావుగా (1)
2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై
3. ఏమి నీ కర్పించగలను - ఏమి లేని వాడనయ్యా రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద
4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా
5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమ మెల్ల వేళలందు నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా
6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా
7. అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద