CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 194

నా ప్రియుడా పాపవిమోచకుడా

naa priyudaa paapavimochakudaa

Ephesians 1:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు (2)నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2)స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)
1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్ యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం
2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్ తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ తల్లి మరిచిన మరువ డేసు - నిరతము
3. సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణము సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో
4. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో నాకై గాయపడిన - బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్
5. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు

Back to Hebron Seeyonu Geethalu