CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 193

తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము

tambura sitaarato maa prabhuni aaraadhinchedamu

Psalms 150:3-4

More
Reference recording on YouTube ↗
పల్లవి:తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము (2)తన నివాసముగ మమ్ము సృష్టించిన (2)నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము (2)
1. ఆది ఆదాము - మరణ శాసనము - మా శరీరమున్ - ఏలుచుండగా (2) అమరుడవై ప్రభూ - భువికేతెంచి (2) మరణపు ముల్లు విరచి - మరణమున్ - గెలిచిన మా ప్రభువా (2)
2. పాపము నుండి - చీకటి నుండి - ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి తన ఆలయముగ చేసిన ప్రభుకు స్తుతి మహిమ - ఘనత - సీయోనులో అర్పించెదమెప్పుడు
3. పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి - నరకపు శిక్ష - తొలగించె మానుండి పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ నిర్మించెను యిలలో - గృహముగా - తన ఆత్మ ద్వారా
4. ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది - సజీవమైన రాళ్ళే ప్రజలు ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి ఆద్యంతరహితుడై - నడుపును - మోక్షపురికి మమ్ము
5. మన్నయినది - వెనుకటివలెనే - మరల భూమికి తప్పక చేరున్ మానవ సంపద - కీర్తి మహిమలు గతించి పోవునిల "సీయోను - మరువకు నీ ప్రభుని
6. లెబానోను వీడి - నాతోరమ్ము - లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు హెబ్రోను చేరుదము - ప్రభువును ఆరాధించెదము

Back to Hebron Seeyonu Geethalu