CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 156

పావనుడా మా ప్రభువా

paavanudaa maa prabhuvaa

Isaiah 6:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:పావనుడా మా ప్రభువా (1) నీ రక్షణకై స్తోత్రములు (2)
1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు (2) ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను (2)
2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా
3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా
4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు
5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను
6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు

Back to Hebron Seeyonu Geethalu