పల్లవి:నీ జల్దరు వృక్షపు నీడలలో - నే నానంద భరితుడనైతిని (2)బలురక్కసి వృక్షపుగాయములు (2)ప్రేమాహస్తములతో తాకు ప్రభు (2)
1. నా హృదయపు వాకిలి తీయుమని - పలు దినములు మంచులో నిలచితివి (2) నీ శిరము వానకు తడిసినను (2)- నను రక్షించుటకు వేచితివి (2)
2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా - దవళ వర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనా క్రాంతుడుగా మార్చబడి - నీ సొగసును నాకు నొసగితివి
3. నీ పరిమళ పుష్ప సుగంధములు - నా రోత హృదయమును నింపినవి ద్రాక్షారస ధారలకన్న మరి - నీ ప్రేమే ఎంతో అతిమధురం
4. ఉన్నత శిఖరములుదాటుచును - ఇదిగో అతడొచ్చు చున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని - నా ప్రియుని కొరకు కనిపెట్టెదను
5. నీ విందుశాలకు నడిపించి - రాజులు యాజకులతో జేర్చితివి జీవాహారము నా కందించి - పరమా గీతములను నేర్పితివి