CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 148

అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు

atyanta sundarundunu ellari kaankshaneeyudu

Galatians 2:20

More
Reference recording on YouTube ↗
1. అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు (1) దేవాది దేవుడైన మా - కల్వరి యేసునాథుడు (1)
పల్లవి:కల్వరి నాథుడా - నన్ను జయించితి - రక్షింప మృతుడైన - కల్వరినాథుడా (1)
2. గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరినాథుడా ||కల్వ||
3. శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా ||కల్వ||
4. తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి ప్రేమనదిని పోసెను - దయా కల్వరినాథుడు ||కల్వ||
5. మహిమ పూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరి ప్రభూ ||కల్వ||
6. స్పటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు నీ వలె నుందు నిత్యము - మహిమ కల్వరినాథుడా ||కల్వ||

Back to Hebron Seeyonu Geethalu