CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 147

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు

yesu prabhoo gaddepainunna neeku

Revelation 4:10

More
Reference recording on YouTube ↗
1. యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు - మా స్తుతులను చెల్లించెదము (1) నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండ వీవంచు కీర్తింతుము (1)
పల్లవి:పాత్రుండవీవే పాత్రుండవీవే - పాత్రుండవీవే మా ప్రభునీవే (1)నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండవీవంచు కీర్తింతుము (1)
2. దేవుడవ్ నీవు నరరూపమెత్తి - దూతలకన్న తగ్గింపబడి స్త్రీ సంతానమౌ నీవు మరణించి - సర్పము తల నణగ ద్రొక్కితివి || పాత్రు ||
3. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను - నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి దైవ మానవులచే వీడబడి - శాప నష్ట మనుభవించితివి || పాత్రు ||
4. మహిమతో మరణమును గెల్చి - గొప్ప విజయము పొందితివి చావు సమాధులపై విజయుండా - నిన్ను స్తుతింపక నెట్టులుందును || పాత్రు ||

Back to Hebron Seeyonu Geethalu