1. సర్వ కృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా (1) స్తొత్రముచేసి స్తుతించెదము - సంతసముగ నిను పొగడెదము (1)
పల్లవి:హల్లెలూయా హల్లెలూయా (2) - హల్లెలూయా యని పాడెదను (1)ఆనందముతో సాగెదను (2)
2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి (2) పరిశుద్దముగా జీవించుటకై - పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా||
3. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృప నిచ్చితివి నాథుని అడుగుజాడలలో - నడచుటకు నను పిలచితివి ||హల్లెలూయా||
4. మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి ||హల్లెలూయా||
5. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి ||హల్లెలూయా||
6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను ||హల్లెలూయా||