CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 132

స్తోత్ర గీతములను పాడుచు

stotra geetamulanu paaduchu

Songs of Solomon 2:4

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడిహల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2)స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని రమ్యమైన రాజును స్తుతించెదం
2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను - తన రక్తముతో మనల కొనెగదా
3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని - ఎంతైన జేయు సామర్థ్యుడని
4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము అత్తరును పూసిన - మరియ వలె మనమును - పరిమళంబులన్ వ్యాపింప జేయుదం
5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని ప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుము - ప్రభువే సర్వము మనకు
6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను జయము జయమటంచు ఆర్భటించెదం
7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే మహిమ దేహములను పొంది యుందుము

Back to Hebron Seeyonu Geethalu