పల్లవి:దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ (1)నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది (1) - దేవా నీ తలంపులు (1)
1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే - స్తుతి పాడెద హృదయముతో (2) స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)- నీవే నా రక్షకుడవని (1)
2. మొదట నిన్ను యెరుగనైతిని - మొదటే నన్ను యెరిగితివి వెదుకలేదు ప్రభువా నేను - వెదకితివి యీ పాపిని
3. మరణమగు వూబిలో నుంటిని - కరుణ నిలిచె నన్ను రక్షింప మరణము నుండి రక్షింప నన్ - నా ప్రభు బలియాయెను
4. పాపలోకములో మునిగి యుంటిని - పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సహించెను - నాకు నూతన జీవ మొసగ
5. అద్భుతమైనది సిలువ దృశ్యం - ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి ప్రభును వర్ణింప నశక్యము - ప్రభువే సహించె దుఃఖము
6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ - చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండెద - నీ ప్రేమ అపారమైనది