CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 113

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

o yesu nee prema ento mahaaneeyamu

John 15:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము (1)ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది - ఓ యేసు నీ ప్రేమ...
1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి (2) ప్రతిఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) - స్తుతికి...
2. సంకట సమయములో - సాగలేకున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడనుందు నంటివి - తోడ...
3. మరణాంధ కారంపు లోయ నే సంచరించిన నిరంతరమేసు నాదు కాపరియై కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు -కరుణ....
4. కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తిపరచుచు - నాతో నుండు నేసు - నాతో.....
5. దేవుని గృహములో సదా స్తుతించెదను నంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్ - హల్లె...

Back to Hebron Seeyonu Geethalu