1. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా (2) చక్కగ దాసుల బ్రోచి రక్షించుము (2)
2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు నతిశయముగను పంచిన దేవా
3. కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన కరుణానిథీ నను ప్రేమించు నిత్యము
4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము ఆధారమీవే దీనోపకారా
5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై సిలువయందు మరణించితివి
6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర నీదు దాసుల నాశీర్వదించుము