పల్లవి : సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమసర్వాధికారి యేసుని సిలువచే కలిగెను
అనుపల్లవి : సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియుసర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబుమురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెనుపరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండుప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె|| సర్వోన్నత ||
2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలోసువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దలజీవుల మధ్యనుండెను - దేవుని గొర్రెపిల్లఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే|| సర్వోన్నత ||
3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనదిపట్టణపు వీధులలో - ప్రవహించుచుండెనుస్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవృక్షంబుస్వస్థత కలిగించును - వృక్షంపు యాకులు|| సర్వోన్నత ||
4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకునిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్|| సర్వోన్నత ||
5. మెట్టల స్థలమందున - నదుల పారజేతున్ఊటల నెన్నో లోయల - నుబుకంగ జేతునునీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటినినీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను|| సర్వోన్నత ||
6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలోదేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండుదావీదు తాళము కలిగి - తన సింహాసనమందుతావిచ్చి చేర్చుకొనును - జయించువారిని|| సర్వోన్నత ||
7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకువిలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధినిబలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము|| సర్వోన్నత ||