పల్లవి:యేసు మధుర నామము పాడుడి - ప్రభుయేసు మధుర నామము పాడుడి
1. పరమును విడచి - ఇహమున కరిగెను (2) పాపుల కొరకై - రక్తము కార్చెను (2) పునరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె (1)
2. దుఃఖము నుండి మము - విడిపించెను శోకము రోగము లన్నియు - బాపెను ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె
3. లోక పాపములను - మోసెను ప్రభువు లోకము కొరకై గాయము లొందెను అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను
4. ప్రియులారా రండి - కలిసి పాడెదము ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో