CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

1 దినవృత్తాంతములు 24

1 Chronicles 24

Changepassage

Chapters of 1 Chronicles

  1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
  14. 14
  15. 15
  16. 16
  17. 17
  18. 18
  19. 19
  20. 20
  21. 21
  22. 22
  23. 23
  24. 24
  25. 25
  26. 26
  27. 27
  28. 28
  29. 29
Another book →
Readingsettings

Language

Text size

Reading light

1

Now these are the divisions of the sons of Aaron. The sons of Aaron; Nadab, and Abihu, Eleazar, and Ithamar.

అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

2

But Nadab and Abihu died before their father, and had no children: therefore Eleazar and Ithamar executed the priest’s office.

నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.

3

And David distributed them, both Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, according to their offices in their service.

దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.

4

And there were more chief men found of the sons of Eleazar than of the sons of Ithamar; and thus were they divided. Among the sons of Eleazar there were sixteen chief men of the house of their fathers, and eight among the sons of Ithamar according to the house of their fathers.

వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.

5

Thus were they divided by lot, one sort with another; for the governors of the sanctuary, and governors of the house of God, were of the sons of Eleazar, and of the sons of Ithamar.

ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.

6

And Shemaiah the son of Nethaneel the scribe, one of the Levites, wrote them before the king, and the princes, and Zadok the priest, and Ahimelech the son of Abiathar, and before the chief of the fathers of the priests and Levites: one principal household being taken for Eleazar, and one taken for Ithamar.

లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.

7

Now the first lot came forth to Jehoiarib, the second to Jedaiah,

మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,

8

The third to Harim, the fourth to Seorim,

మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,

9

The fifth to Malchijah, the sixth to Mijamin,

అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,

10

The seventh to Hakkoz, the eighth to Abijah,

ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,

11

The ninth to Jeshua, the tenth to Shecaniah,

తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,

12

The eleventh to Eliashib, the twelfth to Jakim,

పండ్రెండోది యాకీముకు,

13

The thirteenth to Huppah, the fourteenth to Jeshebeab,

పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,

14

The fifteenth to Bilgah, the sixteenth to Immer,

పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,

15

The seventeenth to Hezir, the eighteenth to Aphses,

పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,

16

The nineteenth to Pethahiah, the twentieth to Jehezekel,

పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,

17

The one and twentieth to Jachin, the two and twentieth to Gamul,

ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,

18

The three and twentieth to Delaiah, the four and twentieth to Maaziah.

ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.

19

These were the orderings of them in their service to come into the house of the LORD, according to their manner, under Aaron their father, as the LORD God of Israel had commanded him.

ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.

20

And the rest of the sons of Levi were these: Of the sons of Amram; Shubael: of the sons of Shubael; Jehdeiah.

మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,

21

Concerning Rehabiah: of the sons of Rehabiah, the first was Isshiah.

రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,

22

Of the Izharites; Shelomoth: of the sons of Shelomoth; Jahath.

ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,

23

And the sons of Hebron; Jeriah the first, Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.

హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.

24

Of the sons of Uzziel; Michah: of the sons of Michah; Shamir.

ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,

25

The brother of Michah was Isshiah: of the sons of Isshiah; Zechariah.

ఇష్షీయా సంతానంలో జెకర్యా,

26

The sons of Merari were Mahli and Mushi: the sons of Jaaziah; Beno.

మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.

27

The sons of Merari by Jaaziah; Beno, and Shoham, and Zaccur, and Ibri.

యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.

28

Of Mahli came Eleazar, who had no sons.

మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.

29

Concerning Kish: the son of Kish was Jerahmeel.

కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.

30

The sons also of Mushi; Mahli, and Eder, and Jerimoth. These were the sons of the Levites after the house of their fathers.

మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.

31

These likewise cast lots over against their brethren the sons of Aaron in the presence of David the king, and Zadok, and Ahimelech, and the chief of the fathers of the priests and Levites, even the principal fathers over against their younger brethren.

రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.

King James Version (1769). Public domain. Text courtesy of the Crosswire Bible Society and eBible.org.

Indian Revised Version (IRV) Telugu, © 2017, 2019 Bridge Connectivity Solutions, used under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence (CC BY-SA 4.0), via eBible.org. Reformatted into chapter files by El-Shaddai Prayer House; the licensor does not necessarily endorse these changes.