పల్లవి:తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును (2)
చరణం 1:సర్వోన్నతుని చాటున - నివసించెడి వాడె (1)
సర్వశక్తుని నీడను విశ్రమించును పరమ ధన్యత యిదియే (2)
చరణం 2:ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును
ఆయన సత్యము నా కేడెమును నేనమ్ముకొను దేవుడు || తన||
చరణం 3:పగటి బాణముకైనా రాత్రి భయమునకైనా
చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను || తన||
చరణం 4:వేయి వదివేలు - కుడి ప్రక్కను కూలినను
దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు || తన||
చరణం 5:నీ ప్రభునాశ్రయమే యెహోవా నివాసం
అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు || తన||
చరణం 6:నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్
పాదములకు రాయి తగలకుండ నిన్నెత్తుకొందురు || తన||
చరణం 7:కొదమ సింహముల -నాగు పాముల నణచెదవు
అతడు నా నామము నెరిగెను అతని తప్పించెదను || తన||
చరణం 8:అతడు నను ప్రేమించెన్ - నామమున మొరపెట్టెన్
అతని విడిపించి ఘనపరతున్ అతని కుత్తరమిత్తున్ || తన||