CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 50

నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించును

neetimantula praardhana devudaalakinchunu

కీర్తనలు 92 :12 "నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు"

More
పల్లవి:నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించును (1) వారు తమాల వృక్షము వలె మొవ్వు వేయుదురు (2)
చరణం 1:మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్
చరణం 2:గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి సతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్
చరణం 3:యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము ఇహము నందు పక్షిరాజు వలె పై కెగురుదురు
చరణం 4:ఊహించలేనిది శక్యము గాని వైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా
చరణం 5:మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదా నమ్ముము నరమాత్రుండెవుడే హాని చేయడు
చరణం 6:ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్
చరణం 7:నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా వృద్ధి పొందితుననె నీ దేవుడు