పల్లవి:హల్లెలూయ, హల్లెలూయ - ప్రభునామం స్తుతియింతుహల్లెలూయ, హల్లెలూయ - అనునిత్యము స్తుతియింతు
చరణం 1:ఘనమైన యేసునామం - ప్రతినోట నుండును
దివ్యమగు ఆయన సన్నిధి - ప్రతిచోట నుండును.
యేసు ఘన నామము పేరు - ప్రతి మోకాలొంగును
ప్రభు యేసు రాకడ దినము - ప్రతి నేత్రము గనును
చరణం 2:ప్రభువైన యేసు నామం మధురం - మధురం
ఆత్మీయ ఆకలి దప్పులు - తీర్చెడి ఘనమగునామం
ఇంపైన యేసునామం వీనులకు విందగునామం
అన్ని నామములకు పైగా - ఉన్నతమైన నామం ॥హల్లెలూయ॥
చరణం 3:బహుమూల్యమైన నామం - ఆదరణీయ యేసు నామం
భూలోక మంతటిలోన - ఆరాధన యోగ్య నామం
పది వేలలో శ్రేష్ఠ నామం - పూజార్హము యేసు నామం
ఈ లోకమంతటను - కొనియాడబడు నామం ॥హల్లెలూయ॥
చరణం 4:పాపక్షమాపణ నొసగు - సామర్థ్యమైన నామం
సాతాను నోడించుటకు - శక్తి గల నామం
మరణమును మరణము ద్వారా - ఓడించిన యేసునామం
లోకమునకు నిత్య జీవము - కల్గించిన ఘన నామం ॥హల్లెలూయ॥