CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 118

దీవెనలొందెదవు ఓ యౌవనుడా!

deevenalondedavu o yauvanudaa!

లూకా 15 : 17-22 “అయితే బుద్ధి వచ్చినప్పుడు... లేచి తండ్రియొద్దకు వచ్చెను”

More
పల్లవి:దీవెనలొందెదవు ఓ యౌవనుడా!యేసు చెంతకు వచ్చిన (1)కావున రమ్ము జాగు చేయకబ్రోచును నిన్ను తన కృపతో (2)
చరణం 1:రక్తము కార్చెను యేసు సిలువలో నీకై తన కృపచే (2) కూర్చుటకై నిన్ను తన సంఘములో ఒక్క అంగముగా (2)
చరణం 2:ఒప్పుకొనిన నీ పాపమును విప్పును నీ పాపపు కట్లను కప్పును రక్షణ వస్త్రముతో నిన్ను నిశ్చయంబుగా
చరణం 3:తృప్తి నొందెదదవు నీవు మందిర సమృద్ధిలో నుండి ఆనంద ప్రవాహ జలమును నీవు పానము చేతువు
చరణం 4:ఆత్మబలుల నర్పించుచు సజీవ రాయివలె నీవు కట్టబడుదువు గట్టి పునాదిపై ఆత్మ మందిరముగా
చరణం 5:సత్య విశ్వాసమునందు చక్కగ నీవు వృద్ధి పొందను సత్య వాక్యము నందు సరిగను వర్థిల్ల శక్తిని ప్రభువొసగున్
చరణం 6:స్థిర పరచును అంతము వరకు నిరపరాధిగా ప్రభు ఎదుట అంగీకరించుము యేసు ప్రభుని సొంత రక్షకునిగా