CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 100

ఓ యువకులారా మనమందరము

o yuvakulaaraa manamandaramu

హెబ్రీ 7 : 25; హెబ్రీ 2 : 18; యదా 24 "తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు"

More
పల్లవి:ఓ యువకులారా మనమందరమునిత్యము యేసుని స్తుతించెదము (2)
చరణం 1:గత కాలమున మన ప్రభుయేసు నూతన దీవెనలను (2) - ఖ్యాతిగా నొసగె- మనకు (2) స్తుతియించెదమేసుని (2) నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2)
చరణం 2:శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
చరణం 3:ఎన్ని శోధనలు భువినున్న తానె మనలను విడిపించును - శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ కనుపాపవలె ప్రభు కాయున్ - నిత్యము నిలుచు మనతో
చరణం 4:శక్తిమంతుడు మన ప్రభు యేసు తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా - ప్రభువు నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
చరణం 5:కృంగిన యువకులారా మీరు భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము జయము జయమని ప్రభుకే యుగయుగములు మన ప్రభుకే హల్లెలూయ గీతములతో