పల్లవి:సాగిలపడి ఆరాధించెదము -సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ (2)
1. దూతలు కనబడి గానము చేసిరి (2) - సతతము మహిమ సర్వోన్నతునికి (2) శాంతియు భువిలో పరిశుద్ధులకు (2) - పావనుడేసుని పూజించెదము (1)
2. గొల్లలు గాంచిరి ఘనకాపరిని - ఉల్లములెల్లను రంజిల్లగను ఎల్లరకు చాటిరి వల్లభుని - ఉల్లాసముతో కొనియాడెదము
3. జ్ఞానులు గనిరి ఘనమగు తారన్ - పూనికతో పయనము గావించి కానుకలిడి పూజించిరి రాజున్ - తనివి తీరగ ఘనపరచెదము
4. మరియ ప్రభుదయ విరివిగ బొంది - ప్రణుతించెను ప్రభు దర్శనమొంది పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు - మురియుచు మదిలో మ్రొక్కెద మిపుడే
5. సుమెయోను స్తుతియించె దేవుని - గమనించె ఘన రక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ - విమలుని మరి మరి స్తుతియించెదము
6. వివరించెనన్న విమోచకుని - విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతియించుచు నీ భువిలో - పవిత్రుని బహు పూజించెదము
7. పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు - రాజులరాజు ప్రభువుల ప్రభువు రాజ్యము నిచ్చెన్ రాజుల జేసెను - విజయుడు యేసుని పూజించెదము