CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 858

పొందుచున్నాము - అత్యధిక విజయము

ponduchunnaamu - atyadhika vijayamu

More
పల్లవి:పొందుచున్నాము - అత్యధిక విజయముమనలను ప్రేమించిన - యేసుని ద్వారా
1. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను - మృతిని గెల్చి తిరిగిలేచెను -(2) శత్రువునోడించి విజయమిచ్చెను (2) పాపము క్షమించి రక్షించుటచే
2. వాక్యము ద్వారా బలపరచెను - విశ్వాసములో స్థిరపరచెను శరీరము పాపముపై జయముపొంది తన స్వరూపమునకు మార్చబడుటచే
3. పరిశుద్ధులగుటకు మనల పిలిచి - తన ఆత్మ ద్వారా నడిపించెను దేవుని పిల్లలమని సాక్షమిచ్చెను క్రీస్తులో మహిమ పరచబడుటకు
4. దేవుని ఇంటిగ కట్టబడుచున్నాము - సహవాసములో నిలిచి యుండి సోదర ప్రేమలో వినయ మనస్కులై ఆశీర్వాదమునకు వారసులమవుటకు
5. మన పతనములు పాపములబట్టి - యింటి గోడలు బీటలు వారెను మన అతిక్రమమును ఒప్పుకొందుము లోకము నుండి వేరైన వారమై
6. మన ప్రభు యేసు వచ్చుచుండగా - త్వరగా రమ్మని ఎదురు చూతము శత్రువును ధైర్యముతో ఎదుర్కొనెదము వినయ విధేయత కలిగియుండి
7. సిద్ధపడుడి దైవ జనమా - బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్దెలలోన నూనెను గలిగి మెలకువ కలిగి సిద్ధపాటుతో

Back to Hebron Seeyonu Geethalu