CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 841

ప్రభువైన క్రీస్తుకు - దాసులారా

prabhuvaina kreestuku - daasulaaraa

More
పల్లవి:ప్రభువైన క్రీస్తుకు - దాసులారాపరిపూర్ణమనస్సుతో - ప్రభును సేవించుడి (2)
అను పల్లవి:తన సన్నిధిలో నిలచుటకునుశ్రద్ధగాను కొలచుటకును మిమ్మును ప్రభు ఎన్నుకొనెను (2)
1. పాపము వలన గత కాలమున - సాతానునకు దాసులమై యుంటిమి (2) పాపక్షమాపణ క్రీస్తులో పొంది - సాతాను చెరనుండి విడుదల నొంది ధన్యులమైతిమి - క్రీస్తుకు - దాసులమైతిమి
2. మీ తలాంతులని వాదుడి ప్రభుకై - రెండంతలుగ వృద్ధి చేయుడి నమ్మకమైన నిజ దాసులుగా - తన పరిచర్య చేయుడి నిరతము ఘనతను పొందెదరు - మీరు - తన సన్నిధియందున
3. యెహోవానే మీరు సేవించుచుందుడి - వేరెవ్వరిని ఇక సేవించకుడి పొలములో పంటలు పండకయున్నను - సాలలో పశువులు లేకపోయినను సర్వదా సేవించుచు - మీరు - ప్రభువులో హర్షించుడి
4. సర్వము ప్రభుకై అర్పించుకొని - ఆసక్తిగా తన సేవ చేయుడి ఘనమైన ఈ గొప్ప భాగ్యము - గమనము చేయుడి మీ బాధ్యత ఇదే వ్యర్థము కానేరదు - ప్రభునందు మీ ప్రతి ప్రయాసము
5. ప్రభువు త్వరగా రానైయున్నాడు నిద్రించువారు విడువబడెదరు మెళకువగా నుండు దాసులైయుండి - తన చిత్తమును జరిగించుచుండుడి జీతము తానిచ్చును - మీకు మీ క్రియల ప్రతిఫలముగా

Back to Hebron Seeyonu Geethalu