పల్లవి:కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా (1)కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా (1)
1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా (1) సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా (1)
2. పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా
3. దీవెనలు నిచ్చుటకై - వసుధ కేతెంచినవాడా నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా
4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా
5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడచితివి మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా
6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా
7. హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా