పల్లవి:ఎవరు జయించెదరో - వారే సమస్తమును పొందెదరు
1. ఎవరు కష్ట బాధ లోర్చెదరో - పట్టువదలక ప్రభుతో నుండు వారే దిట్టముగా నత్యధిక విజయమును పొంది గట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో
2. ఎవరు శోధనలను జయింతురో - జీవమకుటము వారే పొందెదరు పావనుడైన పరమ క్రీస్తేసు తోడ పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో
3. ఎవరు లోకాశలను జయింతురో - వారే సైతానును ఓడింతురు పరిపూర్ణముగా ప్రభుని బలము గలవారై పరలోక స్వాస్థ్యమును పొందెదరు
4. ఎవరు క్రీస్తేసు సంబంధులో - వారే పాప మరణము జయింతురు ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు వీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై
5. ఎవరు ప్రభు సేవను చేసెదరో - వారే పొందెదరు బహుమానము ఓరిమి కలిగి పరుగును ముగించి మురిసెదరు హల్లెలూయ పాటలతో