పల్లవి:నీ సిలువే నాకు శరణు యేసుప్రభో! (2)
1. దురితదూరుడా - నీదరి జేరగ (2) - నాదు పాప - శాపము దీర్చి (2) దరిజేర్చితివి కృపతో (2)
2. శాశ్వతముగ నన్ను ప్రేమించితివి - నీదు ప్రేమకు నేనే సాక్షిని బలమగు నీదు కృపతో
3. నా హృదయములో భారములెల్లను - సిలువను జూడగ సమసిపోయెను శక్తిగల నీ కృపతో
4. రక్తముకార్చి మరణము గెల్చి - శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివి కృపతో
5. నీవు పొందిన బాధలవలన - నిత్యసుఖంబులు సంపూర్ణముగ పొందితి నీదు - కృపతో
6. యేసు నా సిలు వను నే మోసి - ఇలలో నిన్ను వెంబడించుటకు ధైర్యమిచ్చితివి - కృపతో
7. నీ రాకడకై నిరీక్షించు - నిత్యకృపను నే పొందితినంచు పాడెదను - హల్లెలూయ