పల్లవి:యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ! (2)
అను పల్లవి:హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే (2)
1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి (2) మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును (2) యేసు ప్రభో జయహో! (4)
2. నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును యేసు ప్రభో జయహో!
3. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును యేసు ప్రభో జయహో!
4. మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును యేసు ప్రభో జయహో!
5. ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ పరలోకమే నా దేశము - మహిమలోనచట నుందును యేసూ నీతో సదా! యేసుప్రభో జయహో!