పల్లవి:పరలోకము నా దేశము - పరదేశి నేనిల -మాయలోకమేగా - నేను యాత్రికుడను (2)
1. ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది నా దేశము (2) ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)
2. దూతలు పాడుచుందురు పరమందున - దీవారత్రములందు పాడుచుందురు పావనుని చూచి నేను హర్షింతును నిత్యము
3. రక్షకుని చెంతకు యెప్పుడేగెదన్ - వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని కామ్కించెద నా మదిలో ఆయన చెంతనుండ
4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్ - అగుపడు చున్నది గమ్యస్థానము అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్
5. నిత్యానంద ముండును పరమందున - నీతి సమాధానము ఉండునచ్చట పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి