CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 719

యేసు నిన్ను జూతు

yesu ninnu jootu

Psalm 27:4

More
Reference recording on YouTube ↗
1. యేసు నిన్ను జూతు నిందుదేటగా - అగోచరార్థముల్ నే ముట్టుదున్ కృపన్ నేబట్టుకొందు గట్టిగా - నీ మీద వేయుదున్ నా భారము
2. నే దైవాహార మిందె తిందును - ఆత్మీయ ద్రాక్షాపాత్ర త్రాగుదున్ భూ భారముల్ నేబార వేయుదున్ - క్షేమా సౌక్యంబు గల్గుకొత్తగా
3. సంగీత భోజనాల కాలము - ప్రభుండు నాకై బల్ల వేసెను విందారగించుచున్ నీతోడినా - మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున
4. సాయంబీవే వేరే నాకెందుకు? - వేరే చేయి మీద నాను కొనను ప్రభూ నిజంబుగా నీదే చాలున్ - నీ శక్తిలోనే నా బలముండున్
5. పాపంబు నాది నీతి నీదేగా - నేరంబునాది శుద్ధి నీదేగా నీ రక్తనీతియే నా వస్త్రముల్ - నా కాశ్రయంబు శాంతిస్థితులు

Back to Hebron Seeyonu Geethalu