పల్లవి:నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా
అను పల్లవి:నన్ను రక్షింపక ఆర్తధ్వని (2) - వినక నీవేల దూరమున్నావు? (2) || నాదు ||
1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు (2) ఇశ్రే లు స్తోత్రముపై కూర్చున్న (2)- పరిశుద్ధ దేవుడవై యున్నావు (2)
2. మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు
3. నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని
4. నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు
5. యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు
6. గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి
7. గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే