1. ఉన్నత గృహమును త్వరగా చేరి సం - పన్నుని దర్శింతున్ - ఈ (2) పేదగు నా కోర్కె సఫలము చేసిన - నాథుని కొనియాడుదున్ (2)
2. దూతల మధ్యను స్తోత్రము లొందెడు - ప్రభుని స్తోత్రింతున్ - సు గంధము వీచెడి పుష్పరాజంబుల మధ్యను నిద్రింతున్
3. ఆకాశ గణములు సేవించుచుండగ - వీకతో వారిజేరుదున్ - నా యేసుని స్తుతుల నోరార పాడి భాసురముగ నుతింతున్
4. స్ఫటిక నది తీరమున నేను - పాడుచు తిరుగుదును - ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగ నడుగిడుదున్
5. పలువిధ మృగములు పైబడినను - నె - వ్విధమున భయపడను - ఆ వెంగియు సింహము నా పై వచ్చిన నగవుతో రమ్మనెదన్
6. పక్షులు అయ్యెడ ననేకముండును - వృక్షఫలములుండున్ - నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయ ధనముండున్
7. పేతురు యోహాను పౌలుతో నేనును - ప్రీతితో వసియింతును - నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో - హల్లెలూయ పాడెదను